రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల : నేడు సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో రథసప్తమి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి వారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కాగా కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో శ్రీవారి వాహన సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు జరిగే రథసప్తమి బ్రహోత్సవాలను కూడా భక్తులు లేకుండానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా జరిగే వాహన సేవల్లో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులను కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొంటున్నారు.

కాగా ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి ఉత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం పరిసరాలను ఏడు టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించింది టీటీడీ. కాగా ఈ పర్వదినం రోజున ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/