అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) వార్షిక సదస్సు వాయిదా
కరోనా వైరస్ భయం

Bangalore: రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) వార్షిక సదస్సు వాయిదా పడింది. కరోనా వైరస్ భయంతో సదస్సును వాయిదా వేశారు.
ఈ నెల 15వ తేదీ ఆదివారంనుంచి ఈ నెల 17వ తేదీ వరకూ ఎబిపిఎస్ సమావేశం ఇక్కడ జరగాల్సి ఉండగా దానిని వాయిదా వేశారు.
ఈ సదస్సులో సుమారు 1500 మంది సభ్యులు పాల్గొనే అవకాశముందని ఆరెస్సెస్ వర్గాలుపేర్కొన్నాయి.
కేంద్ర, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన హెచ్చరికలు, సూచనల నేపథ్యంలో ఎబిపిఎస్ సమావేశాన్ని సస్పెండ్ చేశామని ఆరెస్సెస్ నేత సురేశ్ జోషి చెప్పారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/