కాన్పూర్ మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Narendra Modi inaugurates Kanpur Metro Rail Project

కాన్పూర్: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉత్త‌ర ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తికాగా ఇవాళ‌ ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయ‌న‌ మెట్రో రైలులో ప్రయాణించారు. ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకూ సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 11,000 కోట్లతో పూర్తి చేస్తున్నట్టు పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మోడీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్ట్ మరో ముందడుగని తెలిపింది. ఈకార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/