రష్మిక గ్లామర్ ట్రీట్

మరోసారి రష్మిక గ్లామర్ ట్రీట్ ఇచ్చి అభిమానులకు కిక్ ఇచ్చింది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ లో రష్మిక నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీవల్లిగా ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో అమ్మడు అన్ని భాషల్లో ఫుల్ పాపులార్టీ సొంతం చేసుకుంది. అమ్మడు ఎక్కడికివెళ్లిన సరే శ్రీవల్లి అంటూ ముద్దుగా పిలుస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి అమ్మడు ఎంత బాగా ఆకట్టుకుంది.

ఇక మిగతా హీరోయిన్ల మాదిరిగానే రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ , వీడియో ను పోస్ట్ చేస్తూ , ఫాలోయర్స్ , నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు అబ్బా అనుకుంటున్నారు. ఈ ఫొటోల్లో రష్మిక గ్లామర్ ట్రీట్ చూసి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. విరహవేదనతో కూడిన పోజులిచ్చి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. మరో ఫొటోలో కుర్చీపై వయ్యారంగా కూర్చొని చూపుల బాణం విసిరింది. ప్రస్తుతం రష్మిక హాట్ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 తో బిజీ గా ఉంది.