బిజినెస్ లోకి అడుగుపెట్టిన రష్మిక ..

Rashmika Mandanna insta pics
rashmika entry to business

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు అంటారు. సినీ రంగంలో హీరోయిన్స్ ఈ సమేతను బాగా ఫాలో అవుతారు. ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న టైంలోనే నాల్గు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. అందుకే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ రంగంలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇలా చేస్తున్నారు. తాజాగా రష్మిక కూడా అదే బాటలో పయనం సాగిస్తుంది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ లో రష్మిక నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల అవడంతో అమ్మడు పాపులార్టీ బాగా పెరిగింది. తెలుగు , తమిళ్ , హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ గట్టిగానే సంపాదిస్తుంది. ఆ సంపాదనతోనే ఇప్పుడు వ్యాపారం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాజాగా రష్మిక వేగన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

ఈ సంస్థకి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు సదరు సంస్థ ప్రకటించడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ అమ్మడు తన స్టార్ డమ్ నే పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా..వచ్చే ఆడబ్బునే పెట్టుబడిగా అదే సంస్థలో పెట్టి భాగస్వామిగా శాతాన్ని అందుకుంటుంది. ఇప్పటికే రష్మిక కొన్ని సంస్థల్ని ఎండార్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఎలాంటి భాగస్వామ్యం కోరలేదు. కేవలం పారితోషికం ప్రాతిపదికనే ఎండార్స్ చేస్తోంది. అయితే వేగాన్ బ్యూటీ ప్రొడక్స్ట్ కి మాత్రం పార్టనర్ గా మారినట్లు తెలుస్తోంది. ఇలాంటి బిజినెస్ స్ర్టాటజనీ ఇప్పటికే కొంత మంది హీరోయిన్లు అనుసరిస్తున్నారు. వాళ్ల బాటలోనే రష్మిక కూడా కొత్త ప్రయాణం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.