సౌత్ ఇండస్ట్రీ ఫై రష్మిక సంచలన వ్యాఖ్యలు

Rashmika Mandanna insta pics
rashmika controversy comments

పుష్ప ఫేమ్ రష్మిక సౌత్ ఇండస్ట్రీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. గీత గోవిందం మూవీ తో యూత్ ను ఫామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది రష్మిక..ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ గా మారింది. రీసెంట్ గా పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సాధించి , తెలుగు, హిందీ , తమిళ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె హిందీ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను మూవీ చేసింది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక.. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ చూస్తూనే తాను పెరిగినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయంటూ వెటకారంగా కామెంట్స్ చేసింది. సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ అంటూ ఎద్దేవా చేయడం తో సౌత్ ప్రేక్షకులు రష్మిక ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని , ఇప్పుడు సౌత్ సినిమాలను అవమానించేలా మాట్లాడతావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ ఫై పలు కామెంట్స్ చేసి వివాదాస్పదం కాగా..ఇప్పుడు సౌత్ సినిమాల ఫై కామెంట్స్ చేసి మరింత వివాదాస్పదం అయ్యింది.