120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డ్డ‌ ర‌ష్యా

దేశ‌వ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ అల‌ర్ట్ జారీ

More than 120 new missile strikes launched by Russia Thursday.. Zelensky adviser says

కివ్‌ః మరోసారి ఉక్రెయిన్‌పై ర‌ష్యా విరుచుకుప‌డింది. 120 మిస్సైళ్ల‌తో అటాక్ చేసింది. ఉక్రెయిన్ దేశ‌వ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఆ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను టార్గెట్ చేస్తూ ర‌ష్యా దాడి చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌జ‌లు, మౌళిక‌స‌దుపాయాల‌నే ర‌ష్యా ల‌క్ష్యం చేసిన‌ట్లు అధ్య‌క్ష స‌ల‌హాదారు మైఖేల్ పొడోయాక్ తెలిపారు. ఈ దాడిలో క‌నీసం ముగ్గురు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. కీవ్‌లో క్షిప‌ణులు ప‌డిన‌ట్లు ఆ న‌గ‌ర మేయ‌ర్ విటాలీ క్లిచ్‌కోవ్ తెలిపారు. ఖార్కీవ్‌, ఒడిసా, లివివ్‌, జైటోమిర్ న‌గ‌రాల్లోనూ భారీ స్థాయిలో పేలుళ్ల శ‌బ్ధాలు వినిపించాయి. ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో మిస్సైల్ అటాక్ జ‌రిగిన‌ట్లు ఒడిసా ప్రావిన్సు నేత మాక్సిమ్ మార్చెంకో తెలిపారు. వివిధ దిశ‌ల నుంచి వైమానిక‌, నౌకా స్థావ‌రాల మీదుగా క్రూయిజ్ మిస్సైళ్ల‌ను ర‌ష్యా వ‌దిలిన‌ట్లు ఉక్రెయిన్ వైమానిక ద‌ళం పేర్కొన్న‌ది. క‌మికేజ్ డ్రోన్ల‌ను కూడా వాడిన‌ట్లు ఉక్రెయిన్ పేర్కొన్న‌ది.

కీవ్ న‌గ‌రంలో సుమారు 16 క్షిప‌ణుల‌ను తిప్పికొట్టారు. అయితే మిస్సైళ్ల‌ను ఢీకొట్ట‌డం వ‌ల్ల శిథిలాలు ఇండ్ల‌పై ప‌డ్డాయి. మైకోలేవ్ ప్రాంతంలో అయిదు మిస్సైళ్ల‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేసిన‌ట్లు అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ఒడిసా ప్రాంతంలో 21 మిస్సైళ్ల‌ను కూల్చిన‌ట్లు అధికారి చెప్పారు. మిస్సైళ్ల శిథిలాలు ఇండ్ల‌పై కూలడంతో కొంద‌రు గాయ‌ప‌డ్డారు. లివివ్ న‌గ‌రంలోనూ భారీ పేలుడు శ‌బ్ధాలు ప‌లుమార్లు వినిపించిన‌ట్లు మేయ‌ర్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/