విజయనగరం జిల్లాకు చేరిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌

డిప్యూటి సిఎం కు కరోనా పరీక్ష

rapid testing kit
rapid testing kit

విజయనగరం: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు కరోనాకు సంబందించిన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల పంపిణి జరుగుతుంది. ఇందులో బాగంగా ఇవాళ విజయనగరం జిల్లాకు 1,680 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు చేరుకున్నాయి. దీనిలో బాగంగా ఏపి రాష్ట్ర డిప్యూటి సిఎం పుష్పశ్రీవాణికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌ అని నిర్దారణ అయింది. కాగా విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని మంత్రి అన్నారు.

తాజ తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/