వైఎస్సార్‌ కాపు నేస్త పథకం నిధులను విడుదల చేసిన జగన్

YSR కాపు నేస్తం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఈరోజు నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని జగన్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

3,38,792 మంది లబ్దిదారులు ఖాతాలు లో 508 కోట్లు జమ అయ్యాయన్నారు. మనది అక్కచెల్లెళ్ళు, రైతులు, పేదలు ప్రభుత్వమని… మేనిపెస్టో లో చెప్పకపోయిన మీకు తోడుగా ఉండాలని ఈ పధకం తీసుకు వచ్చామని వెల్లడించారు. మూడేళ్ళ లో కాపు నేస్తం పథకానికి 1492 కోట్లు అందించాము.. మూడేళ్ళలో కాపు సామాజిక వర్గానికి 16256 కోట్లు లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు పధకం ద్వారా ద్వారా 2,46,080 కాపు మహిళలు కి12 వేలు కోట్లు లబ్ది చేకూరుందని.. ఈ మూడేళ్ళ లో కాపు కుటుంబాలు కి జరిగిన లబ్ది 32 వేలు కోట్లు అని వెల్లడించారు జగన్‌. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.