ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కన్నబాబు
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ

Amaravati: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కన్నబాబును నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎండీగా కన్నబాబు ఉన్నారు. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి వాణిమోహన్‌ను ఆ బాధ్యతలనుంచి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగించారు.
ఆమెను ప్రభుత్వాని కి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. అంతకుముందు ఎన్నికల సంఘం కార్యక్రమాలకు విఘాతం కలిగించారనే అభియోగాలతో ఎస్‌ఈసీ జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్‌ను విధుల నుంచే తొలగించిన సంగతి విదితమే.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/