ఇంట్లోనే ఉండి మనల్ని మనం కాపాడుకుందాం

హైపర్‌ ఆది వీడియో సందేశాన్ని షేర్‌ చేసిన ఆరోగ్య ఆంధ్ర

hyper aadi
hyper aadi

అమరావతి: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించినప్పటికి కొంతమంది రోడ్లమీదకి అనవసరంగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు,వైద్యులకు, ప్రభుత్వాధికారులకు సహకరించాలని జబర్ధస్థ్‌ కంటిస్టేంట్‌ హైపర్‌ అన్నాడు. ఈ మేరకు ఆది వీడియో సందేశాన్ని ఆరోగ్యాంధ్ర తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. బయట కాలుపెట్టకుండా ఇంట్లోనే ఉండడం ఇబ్బందిగా ఉన్న పర్లేదు. మనం కాలు బయటపెడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లోనే ఉండి మనల్ని మనం కాపాడుకుందాం. అలాగే మన ఫ్యామిలిని, దేశాన్ని కాపాడుకుందాం అని సూచించాడు. అలాగే కరోనాకు సంబందించిన పూర్తి అధికారిక సమాచారం కోసం 8297104104 కి వాట్సాప్‌ చేయాలని సూచించారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/