రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యులు చరణ్ కు బర్త్ డే విషెష్ ను తెలుపుతూ వస్తున్నారు. ఇక మెగా అభిమానులైతే నిన్నటి నుండే మెగా సంబరాలు మొదలుపెట్టారు. పలు సేవ కార్యక్రమాలు చేపట్టి వారి అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కు చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరింత ఎదగాలని ఆశీర్వదించారు. “అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను” అంటూ తన ప్రేమను పంచారు పవన్ కళ్యాణ్.
మరోపక్క మెగాస్టార్ చిరంజీవి తనయుడికి ప్రేమగా ముద్దు పెడుతున్న పిక్ పోస్ట్ చేసి అభిమానుల్లో మరింత జోష్ నింపారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా.. అతడిపై చెంపపై తాను ప్రేమగా ముద్దు పెట్టుకున్న ఫొటోను మెగాస్టార్ ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాదు ‘ప్రౌడ్ ఆఫ్ యు నాన్న.. హ్యాపీ బర్త్డే’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఈ పిక్ చూస్తుంటే.. చరణ్ సాధించిన విజయాలకు తండ్రిగా మెగాస్టార్ ఎంతగా పొంగిపోతున్నాడో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. తండ్రీ కొడుకుల ప్రేమానురాగాలు చూసి నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.