కొడాలి నానికి కిడ్నీ ఆపరేషన్ సక్సెస్

kodali nani as ap state development board chairman
Kodali nani’s kidney operation was a success

Community-verified icon

వైస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని కి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆ సమస్య ఎక్కువైపోవడం తో మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చేరారు. నిన్న రాత్రి ఆయనకు డాక్టర్లు ఆపరేషన్ చేయగా..ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.

ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు నిర్వహించనున్నారు.

ఇక నాని రాజకీయాల విషయానికి వస్తే..తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా 2004, 2009 శాసనసభ ఎన్నికలలో భారీ మెజార్టీ తో గెలిచాడు. అంతే కాదు ఎన్టీఆర్ తో సాంబ సినిమాను నిర్మించాడు. కొన్ని రాజకీయ కారణాల మూలంగా 2012లో తెలుగు దేశం పార్టీ నుండి బయటికి వచ్చేసాడు. తరువాత జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరాడు. 2014 శాసన సభ ఎన్నికలలో గుడివాడ శాసన సభ నియోజక వర్గం నుండి గెలుపొందాడు. 2019 మరోసారి గెలిచారు.