మరోసారి తండ్రి అయిన రైనా

మగ బిడ్డకు జన్మనిచ్చిన అతని భార్య ప్రియాంక

raina -priyanka
raina -priyanka

ముంబయి: భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనా మరోసారి తండ్రి అయ్యాడు. రైనా భార్య ప్రియాంక రైనా నేడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. కాగా రైనా దంపతులకు ఇది వరకే ఒక కూతురు జన్మించింది. ఇపుడు కొడుకు పుట్టడంతో రైనా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఎంఎస్‌ధోని ఫాన్స్‌అఫీసియల్‌ తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్‌ వాయిదా పడడంతో రైనా తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/