‘వారసుడు’ నుండి మాస్ సాంగ్ రిలీజ్

విజయ్ నటిస్తున్న వారసుడు మూవీ నుండి తమిళ్ ఫస్ట్ సింగిల్ రంజితమే రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు లో ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘బొండుమల్లె చెండూ తెచ్చా .. భోగాపురం సెంటూ తెచ్చా, కళ్లకేమో కాటుక తెచ్చా .. వడ్డాణం నీ నడుముకిచ్ఛా’ అంటూ సాగే ఈ పాట ను రిలీజ్ చేసారు మేకర్స్. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తమిళ్ లో (వరిసు) పేరుతో రిలీజ్ కాబోతుంది. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుండి ” రంజితమే” అనే పాటని రిలీజ్ చేయగా..శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోగా..తాజాగా తెలుగు లో ఈ పాటను రిలీజ్ చేసారు.

‘బొండుమల్లె చెండూ తెచ్చా .. భోగాపురం సెంటూ తెచ్చా, కళ్లకేమో కాటుక తెచ్చా .. వడ్డాణం నీ నడుముకిచ్ఛా’ అంటూ ఈ పాట నడక సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి – మనసి ఆలపించారు. జానీ మాస్టారు కొరియోగ్రఫీతో జోరుగా .. హుషారుగా సాగే ఈ పాటలో, విజయ్ డాన్స్ ఆకట్టుకుంటుంది. మరోసారి ఆయన తన ఎనర్జీ లెవెల్స్ చూపించిన పాట ఇది. గ్రాఫిక్స్ లోనే అయినప్పటికీ, కలర్ ఫుల్ ఫ్లవర్స్ నేపథ్యంలో .. కలర్ ఫుల్ గా ఈ పాటను ఆవిష్కరించారు. మీరు కూడా ఈ పాటపై లుక్ వెయ్యండి.

YouTube video