ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడం ఫై కృతి సనన్ క్లారిటీ

గత నాల్గు రోజులుగా సోషల్ మీడియా లో ప్రభాస్ – కృతి సనన్ పెళ్లి ఫై అంత మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ ను పెళ్లి చేసుకునేందుకు నేను సిద్ధం అని కృతి చెప్పడం , ఆ తర్వాత వరుణ్ ధావన్ సైతం ప్రభాస్ – కృతి సనన్ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడం తో మరింత వైరల్ గా మారింది. ఈ వార్తల ఫై కృతి క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. వరుణ్ ధావన్ అటపట్టించడానికి అలా అన్నాడని తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ఫోస్ట్ చేసింది.

కృతి మాట్లాడుతూ..”ఇది ప్యార్ లేదా PR కాదు. మా భేదియా ప్రచారం కోసం ఒక రియాల్టీ షోలో వరుణ్ ధావన్ కొంచెం ఓవర్ చేసాడు.అతని సరదా పరిహాసం ఇలాంటి పుకార్లకు దారి తీస్తుంది. కొన్ని వెబ్ సైట్లు నా పెళ్లి తేదీని ప్రకటించే ముందు… మీ సందేహాలను తీర్చనివ్వండి..” అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. అభిమానుల ఉబ్బిపోతున్న బుడగ(పొట్ట)ను పగలగొట్టనివ్వండి అని కూడా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవని కృతి తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు వరుణ్ ధావన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమా ప్రమోషన్‌ కోసం మా అన్న పేరుని ఇంతలా వాడుతున్నారేంటి?’ అంటూ మండిపడుతున్నారు.

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా కృతి సీత పాత్రలో నటిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని కథనాలొచ్చాయి. అంతేకాదు సెట్స్ లో ప్రభాస్ మునుపెన్నడూ లేనంత జోష్ తో కృతితో కలిసి పోయాడని గుసగుసలు వినిపించాయి. ఇక ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక డ్రామాకు పురాణేతిహాసం రామాయణం స్ఫూర్తి. అందులో రాముని పాత్రను సీత పాత్రను రావణుడి పాత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని సమాచారం. ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటించారు. 16 జూన్ 2023న ఈ మూవీ విడుదల కానుంది.