ఈరోజు ఈడీ ముందుకు మంత్రి మల్లారెడ్డి కొడుకు, అల్లుడు

బుధువారం ఈడీ ముందుకు మంత్రి మల్లారెడ్డి కొడుకు, అల్లుడు హాజరుకాబోతున్నారు. ఐటీ రైడ్స్ కేసులో సోమవారం మంత్రి మల్లారెడ్డి తో పాటు 12 మందిని ఐటీశాఖ అధికారులు విచారించిన సంగతి తెలిసందే. మంగళవారం మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల సిబ్బందిని విచారించగా..ఈరోజు మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించనున్నారు.

ఐటీ అధికారులు అడిగిన ఫార్మాట్లో వివరాలతో వారిరువురూ విచారణకు హాజరుకానున్నారు. రెండు రోజుల విచారణలో భాగంగా కాలేజీ సీట్ల కేటాయింపు నుంచి పేమెంట్ డీటెయిల్స్ వరకు వివరాలు సేకరించారు. ఈ రోజు సీట్ కేటాయింపునకు జరిగిన పేమెంట్లు, బ్యాంక్ ఖాతాలపై మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్గా ఉన్న భద్రారెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు.