విదేశాల నుంచి వ‌చ్చేవారిపై క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన చైనా

China reduces quarantine for people arriving from abroad

బీజింగ్ : చైనా విదేశాల నుంచి వ‌చ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. మిగితా దేశాల‌తో పోలిస్తే చైనా క‌ఠిన‌మైన కోవిడ్ విధానాన్ని అవ‌లంబిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వ‌చ్చే వాళ్లు హోట‌ల్లో ఏడు రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాలని, ఆ త‌ర్వాత మూడు రోజుల పాటు హోమ్ అబ్జ‌ర్వేష‌న్‌లో ఉండాలని జాతీయ ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌తంలో హోట‌ల్ క్వారెంటైన్ 14 రోజులు, హోమ్ అబ్జ‌ర్వేష‌న్ ఏడు రోజుల పాటు ఉండేది. బీజింగ్‌తో పాటు మ‌రో ఏడు న‌గ‌రాల్లో కోవిడ్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు. జీరో కోవిడ్ విధానంలో భాగంగా చైనాలో క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేశారు. వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ అమ‌లు చేశారు. మాస్ టెస్టింగ్ కూడా నిర్వ‌హించారు.విదేశాల నుంచి వ‌చ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/