నేటి మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్న రాంచరణ్ దంపతులు

మెగా పవర్ రామ్ చరణ్ దంపతులు ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా హాస్పటల్ లో ఉన్న ఉపాసన.. నేడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

ఈ తరుణంలో ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచరణ్ దంపతులు అపోలో ఆసుపత్రి వద్దనున్న నాగమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే తమ పాప ను మీడియా కు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెళ్లయిన 11 సంవత్సరాలకు వీరికి మొదటి బిడ్డ పుట్టింది.