సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది వారియ‌ర్’

రామ్ ‘ది వారియ‌ర్’ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జులై 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతి సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. దీంతో అభిమానులే కాక సినీ లవర్స్ సైతం సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో చిత్ర మేకర్స్ సెన్సార్ కార్య క్రమాలను సైతం పూర్తి చేసి , రిలీజ్ కు సిద్ధమయ్యారు. సినిమాను చూసిన సెన్సార్ అధికారులకు సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే 2గంట‌ల 35నిమిషాల ర‌న్ టైంను మేక‌ర్స్ లాక్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ త‌ర్వాత రామ్ యాక్ష‌న్ సినిమాల‌ను మాత్ర‌మే చేస్తున్నాడు. కాగా ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విల‌న్‌ల‌ను చిత్తు చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. మరి ఈ ఖాకి యూనిఫార్మ్ రామ్ కు ఎంతగా కలిసొస్తుందో చూడాలి.