ఏపి రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ఆగస్టు 23కు వాయిదా

Ap High Court
ap-high-court

అమరావతిః ఏపి రాజధాని పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. తాము మరో కోర్టు ధిక్కార పిటిషన్ వేశామని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని ఏజీ కోరారు. ఆ ఫైల్ వద్ద తమ వద్దే ఉందని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. ఎల్పీఎస్ లే అవుట్లలో పనులు ఆలస్యం కావడంతో తమకు పరిహరం చెల్లించాలన్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోరారు. పిటిషన్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఆగస్టు 23వ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/