రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళిసై రేపు (మే 17 ) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలులో బయల్దేరి 17న ఉదయం 4.15కు కొత్తగూడెం చేరుకుంటారు. 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి గెస్ట్‌హౌజ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు.
ఉదయం 8.40 గంటలకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 9.10కు వీరభద్ర ఫంక్షన్ హాలులో ‘గిరిజనుల ఆరోగ్యం’పై అవగాహన సదస్సులో పాల్గొంటారు. గిరిజనులతో మమేకం అయ్యి.. 11 నుంచి 12 గంటల వరకు రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని 12.15కు ఐటీసీ అతిథిగృహానికి చేరుకుంటారు.
భోజనానంతరం మధ్యాహ్నం 1.20గంటలకు కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథిగృహానికి వచ్చి అనంతరం రోడ్డు మార్గాన 2.30కు ఖమ్మం ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. ఖమ్మంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రైలెక్కి రాత్రి 10.35కి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.