ఉప్పెన డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ ఫిక్స్

ఉప్పెన మూవీ తో సూపర్ హిట్ అందుకునం బుచ్చిబాబు..ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగా వరుణ్ తేజ్ ను హీరోగా పెట్టి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉప్పెన మూవీ తెరకెక్కించారు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే బుచ్చిబాబు సూపర్ హిట్ అందుకున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రూ. 100 కోట్లు వసూళ్లని రాబట్టి ట్రేడ్ విర్గాలని వస్మయానికి గురిచేసింది. దీంతో తొలి ప్రయత్నంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడిగా బుచ్చి బాబు రికార్డు సాధించి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుచ్చిబాబు మరో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఎవరి డైరెక్షన్లో చేస్తారా అని అంత అనుకుంటున్నా వేళ బుచ్చిబాబు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ వ్రైటింగ్స్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఇదే సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు.’కొన్ని సార్లు తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది. రామ్ చరణ్ సార్ తో నా తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటిస్తున్నందుకు అమితానందంగా వుంది. వెలకట్టలేని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చరణ్ సార్ అంటూ పోస్ట్ చేసారు.