రామ్- బోయపాటి ఫస్ట్ థండర్ రాబోతుంది

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – రామ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ నుండి ఫస్ట్ థండర్ రాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలయ్య కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన అఖండ సినిమా ను అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలయ్య కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన అఖండ సినిమా ను అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.. టైటిల్ ను కానీ ప్రకటించకపోయేసరికి అభిమానులు ఆ ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుస్తున్నారు. ఈ క్రమంలో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కాంబో మూవీ ఫస్ట్ థండర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 15వ తారీకున ఉదయం 11.25 గంటలకు బర్త్ డే స్పెషల్ వీడియో రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది.