ర్యాప్ సాంగ్ లో రకుల్

ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్

Rakul in rap song
Rakul in rap song

దక్షిణాది అగ్రకథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ .

ఇంట్లో తాను చేస్తున్న పనులు.. వర్క్ఔట్స్ గురించి తెలియజేస్తూ వీడియోలు షేర్ చేస్తుంది.

కరోనా లాక్ డౌన్ లో రకరకాల ఛాలెంజులు అంటూ రకుల్ సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ”కరే ని కర్దా రాప్ ఛాలెంజ్” లో పార్టిసిపేట్ చేసింది. 

దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ”#CareNiKardaRapChallenge కు నన్ను నామినేట్ చేసినందుకు.. వీడియోను రూపొందించడానికి నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అర్జున్ కపూర్.

మీరు నాకు బాగా సహాయం చేసారు.. నేను మీకు భిన్నంగా ఫుల్ ర్యాప్ ముగించాను!” అని పోస్ట్ పెట్టింది రకుల్. ఈ ఛాలెంజ్ కు నటుడు టీవీ హోస్ట్ అపరశక్తి ఖురానా ని రకుల్ నామినేట్ చేసింది.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/