పవన్ ‘వినోదయా సితం’ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం తాలూకా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాను జులై 28 న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో సూపర్ హిట్ అయినా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ది ప్రధానమైన పాత్ర అనీ .. సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కథ అంతా కూడా సాయితేజ్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టుకొని , శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో సినిమాను జులై 28వ తేదీన ప్రేక్షకుల్ ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఓ యువకుడు కారు యాక్సిడెంట్ లో మరణిస్తే దేవుడు అతనికి రెండో అవకాశం ఇస్తాడు. తమిళంలో ఇదే కాన్సెప్ట్ గా రాగా తెలుగులో సైతం ఇదే నేపద్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాటలు – స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తుండగా కేతికాశర్మ , ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.