రికార్డ్స్ కొల్లగొడుతున్న రాధే శ్యామ్ టీజర్

అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భాంగా విడుదలైన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దుమ్ములేపుతుంది. కేవలం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్‌కి పైగా రాబట్టడం ఇప్పుడు విశేషం. ఇంతవరకు టాలీవుడ్‌లో ఏ మూవీ టీజర్‌కు రాని విధంగా భారీ వ్యూస్‌ను రాబడుతూ దూసుకెళ్తుంది. దాంతో సైలెంట్‌గా ఉన్న ‘రాధే శ్యామ్’ టీజర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుదని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వ్యూస్ చాలు సినిమా ఫై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో చెప్పడానికి అని అంటున్నారు.

ఇక టీజర్ విషయానికి వస్తే..“నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ. మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు” అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఆసక్తి రేపుతోంది. టీజర్ లో టవర్ కూలిపోవడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే సినిమా విషాదాంతంగా ముగియనుందా ? అనే సందేహం వస్తోంది. ఏదేమైనా చాలాకాలం నుంచి టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. జనవరి 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.