కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఇద్దరు ముష్కరుల హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లాలోని అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దీంతో గాలింపు బృంధాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయని జమ్ము పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/