స్వీయ నిర్బంధంలో ఉన్నా

శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర

స్వీయ నిర్బంధంలో ఉన్నా
Former Sri Lankan captain Kumara Sangakkara

తనకు తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర తెలిపాడు. తమ ప్రభు త్వ ఆదేశానుసారం స్వచ్ఛందంగా ఇంటికే పరిమిత మయ్యామని సంగక్కర తెలిపాడు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ శ్రీలంకలోనూ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సంగక్కర మాట్లాడుతూ తను ఇటీవల లండన్‌ నుంచి వచ్చి నట్టు తెలిపాడు.

తనకు ఎలాంటి వైరస్‌ ప్రభావిత లక్షణా లు కని పించలేదని అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

ప్రజలు సామాజిక దూరం పాటించాలని సంగక్కర కోరాడు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/