పోషకాల రాజ్మా

Rajma of Nutrition

మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్న పప్పు దినుసుల్లో ఒకటి రాజ్మా. సమతుల్య పోషకారాహార ప్రియుల పళ్లెంలో ఉండితీరాల్సిన రుచుల్లో ఇది ఒకటి. తక్షణ శక్తినిచ్చే స్టార్స్‌ (ఒకరకం పిండి పదార్థం) రాజ్మాలో అధికం. ఇది కండర పుష్టికి తోడ్పడుతుంది. శాకాహారులకు అవసరమైన ప్రొటీన్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. రాజ్మాలోని పీచు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. పీచుపదార్థం వల్ల మరో ఉపయోగమూ ఉంది. రాజ్మా వంటకాలు తిన్న తరువాత కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో తక్కువ ఆహారం తీసుకుంటాం. కేలరీలు తగ్గుతాయి. ఫెనోలిక్‌ యాసిడ్‌, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు రాజ్మాలో ఎక్కువ. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్లను అడ్డుకునే గుణాలకైతే కొదవలేదు. రాజ్మాతో విడిగా కూర చేసుకోవచ్చు. లేదంటే ఇతర కూరల్లోను కలుపుకుని వండుకునే సౌలభ్యం ఉంది. ఈ పప్పు దినుసుని నిలువ చేసుకోవచ్చు.
కాబట్టి ఏడాది పొడవునా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుని అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/