సచివాలయ మార్గంలో పోలీసుల ఆంక్షలు

వీధుల్లో కంచె వేయడమేంటని మందడం రైతులు ఆగ్రహం

Police
Police

అమరావతి: రాజధాని ప్రాంతం మందడంలో నిర్వహిస్తున్న మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. రహదారి సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేయించారు. రహదారిపైకి ఎవ్వరినీ రానీయకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. దీంతో చిరు వ్యాపారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిఎం సచివాలయానికి వస్తే బంద్‌ పాటించాలా? స్వచ్ఛందంగా బంద్‌ పాటించినప్పుడు బలవంతంగా దుకాణాలు తెరిపించిన పోలీసులు.. సిఎం వస్తే మూసివేయించమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సహకారం అంటే కంచె వేసి ఎవరూ బయటకు రాకుండా చేయడమేనా? అని రాజధాని రైతులు మండిపడ్డారు. వీధుల్లో కంచె వేసి సచివాలయానికి వెళ్లేంత భయం సిఎంకు ఎందుకని రైతులు నిదీశారు. దారుణంగా మందుల దుకాణాలు, ఆస్పత్రులను కూడా పోలీసులు తెరవనీయడం లేదని ప్రజలు ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/