11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లోకి జుకర్ బర్గ్ రీ ఎంట్రీ

‘డబుల్ ఐడెంటిటీ’ కార్టూన్ లోని ఫొటోను షేర్ చేసిన మార్క్

Mark Zuckerberg’s first tweet in 11 years is playful jibe at Elon Musk

న్యూయార్క్‌ః ప్రముఖ సామాజికమాధ్యమం ఫేస్ బుక్ ఫౌండర్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కు పోటీగా మెటా డెవలప్ చేసిన థ్రెడ్ కు సంబంధించి పోస్ట్ చేశాడు. స్పైడర్ మేన్ దుస్తులు ధరించిన వ్యకి అదే దుస్తులు ధరించిన మరొక వ్యక్తిని చూపుతున్నట్టు ఉన్న చిత్రాన్ని షేర్ చేశాడు. ఇది 1967లో వచ్చిన స్పైడర్ మేన్ కార్టూన్ ‘డబుల్ ఐడెంటిటీ’ లోనిది. విలన్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నించేలా ఆ చిత్రం ఉంది. అయితే కేవలం కార్టూన్ ఫొటోను మాత్రమే మార్క్ షేర్ చేశారు. కాగా ట్విట్టర్ అధినేత మస్క్ ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. 2012 జవనరి 18న జుకర్ బర్గ్ చివరి సారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి.