సర్కార్ వారి పాట షూటింగ్ పూర్తి ..

సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈరోజుతో ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేస్తూ అదిరిపోయే యాక్షన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ఒక పాట మినహా షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ ఆర్‌‌ఎఫ్‌‌సిలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై ఆ పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ఈ చిత్రంలోని ఒక్కో సాంగ్ అభిమానులను , శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. మూడవ సింగిల్ శనివారం ఉదయం 11గంటల 07 నిమిషాలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.