అమెరికా యుద్ధనౌక లో అగ్ని ప్రమాదం

ఇప్పటి వరకు 60 మందికి గాయాలు

Fire in an American warship
Fire in an American warship

అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ బాన్‌హోమి రిచర్డ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. 

ఆ భారీ షిప్‌లో ఉన్న కార్గోలో మంటలు వ్యాపించాయి. సాన్‌ డియాగో నౌకాశ్రయంలో ఉన్న యుద్ధ నౌకలో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 60 మంది గాయపడినట్లు తెలుస్తోంది. యుద్ధనౌకలో చెలరేగుతున్న మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది  ప్రయత్నిస్తూనే ఉన్నది.

అమెరికా నౌకాదళంలో ఈ యుద్ధనౌకను సెకండ్‌ ర్యాంకతో పోలుస్తారు. యూఎస్‌ఎస్‌ బాన్‌హోమి రిచర్డ్‌ పొడుగు 257 విూ

రెగ్యులర్‌ మెయిన్‌టేనెన్స్‌ కోసం దీన్ని సాన్‌ డియాగో షిప్‌యార్డ్‌లో ఆపారు. ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.

ప్రమాదం సమయంలో షిప్‌లో కేవలం 160 మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు చెప్పారు. సాధారణంగా ఆ యుద్ధనౌకలో వెయ్యి మంది సిబ్బంది ఉంటారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/