రాజస్థాన్​లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల

Rajasthan polls 2023.. Congress releases manifesto, promises caste census

జైపూర్‌ః ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. తాజాగా రాజస్థాన్​లో కాంగ్రెస్ ప్రజాకర్షక మేనిఫెస్టోను విడుదల చేసింది. జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని.. రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని మేనిఫెస్టోలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

రాజస్థాన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఇతర ముఖ్య అంశాలివే..

.ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
.మహిళలకు ఏడాదికి రూ.10వేల నగదు,
.ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం
.రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పంటలకు కనీస మద్దతు ధర
.ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు
.చిరంజీవి మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు
.ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.15లక్షల వరకు బీమా పథకం