ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా

Chandrababu

అమరావతిః ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, హెరిటేజ్ సంస్థ తదితరులను నిందితులుగా పేర్కొంది.