మోడీ ప్రధానిగా ఉండటం భారత్ అదృష్టం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్య

Rajnath Singh

New Delhi: దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం కరోనా వైరస్ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తరువాత ఈ ఆరేళ్లలో ప్రభుత్వానికి ఎదురైన అతి పెద్ద సంక్షోభం కోవిడ్ -19 అన్నారు.

అయితే ఈ మహావిపత్తు సమయంలో మోడీ ప్రధానిగా ఉండటం భారత్ అదృష్టమని ఆయన అన్నారు.

కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుతీరి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఒక ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు

అమెరికాలో కరోనా వ్యాప్తి, మరణాల పరిస్థితిని గమనిస్తే ఆ దేశం ఎంతటి దయనీయస్థితిలో ఉందో అర్థమౌతుందన్నారు.

అయితే భారత్ లో మోడీ అత్యంత సమర్థంగా పని చేస్తున్నారనీ, ఆయన దక్షత కారణంగానే భారత్ లో అమెరికా పరిస్థితి ఉత్పన్నం కాలేదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

విపక్షాల విమర్శలపై మాట్లాడుతూ దేశంలో లాక్ డౌన్ విధించాలన్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని అన్నారు.

ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించారన్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్( సీడీఎస్) నియామకం ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/