ఆ పార్టీ నేతలు రాముడి భక్తులు కాదు, రావణుడి భక్తులు

పెట్రో‌ల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై మండిప‌డ్డ రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ సింగ్‌

న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అంద‌రూ ఊహించిన విధంగానే వాటి ధ‌ర‌లు వ‌రుస‌గా పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత‌ల‌ను రావ‌ణుడి భక్తులతో పోల్చుతూ రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ కచరియావాస్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఆ పార్టీ నేతలు రాముడి భక్తులు కాదని, రావణుడి భక్తులు అని ఆయన అన్నారు. ఆ పార్టీ నేత‌లు శ్రీ‌రాముడి విధానాల‌ను పాటించ‌కుండా రావ‌ణుడి విధానాల‌నే పాటిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. రాముడు తన రాజ్యంలోని అందరినీ సమానంగా చూశాడని, రావణుడు మాత్రం మోసగాడని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే, క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై కూడా ఆయ‌న స్పందిస్తూ… ఆ సినిమా టికెట్ల‌ను పంచిపెడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా దేశంలో పెట్రోల్‌, డీజిల్ కోసం కూడా కూప‌న్లు పంచి పెట్టాల‌ని ఆయ‌న చుర‌కంటించారు.

కాగా, దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతార‌ని ఎన్నిక‌ల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్య‌క్తం చేసింది. అదే విధంగా వాటి ధరలు పెరుగుతుండడంతో ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/