అమెరికాలో భారీగా మంచు..60 వాహనాలు ఢీ

ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు

పెన్సిల్వేనియా : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై భారీగా మంచు కురిసింది. ద‌ట్ట‌మైన మంచు ఏర్ప‌డ‌టంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఒకదానినొకటి 60 దాకా వాహనాలు ఢీకొట్టుకున్నాయి. తీవ్రమైన మంచు కారణంగా అప్పటికే చాలా వాహనాలు ప్రమాదానికి గురై రోడ్డుపై నిలిచిపోయాయి. అయితే, వెనకనుంచి వస్తున్న వాహనాలు వాటిని గమనించకపోవడంతో వేగంగా వచ్చి ఢీకొట్టేశాయి.

ట్రాక్టర్లు, కార్లు, ట్రక్కులు సహా 50 నుంచి 60 వాహనాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం అనంతరం కొన్ని కార్లకు మంటలు అంటుకున్నాయి. ఘటనలో ముగ్గురు చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు. కొన్ని కిలోమీటర్ల పాటు హైవేపై ట్రాఫిక్ జాం అయింది. మంచు చాలా తీవ్రంగా కురుస్తుండడంతో సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిస్ అయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా, నెలరోజుల్లో ఇంత పెద్ద మంచు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అంతకు ముందు నెల క్రితం షూల్ కిల్ కౌంటీలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/