శ్రీలంక ప్రధాని పీఠంపై మళ్లీ రాజపక్సా

దేశం : శ్రీలంక

Rajapaksa
Rajapaksa

వాయిదాపడుతూ వచ్చిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. గత ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన మహీంద రాజపక్ష ఈ సారి తిరుగులేని మెజార్టీతో మళ్లీ పాలనపగ్గాలు చేపట్టారు.

మహీంద రాజపక్ష సోదరుడు గోటబయ రాజపక్ష శ్రీలంక అధ్యక్షునిగా పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత అప్పటి ప్రధాని రణిల్‌ విక్రమ్‌సింగే రాజీనామా చేయ డం,తదనంతరపరిణామాల్లో మహీందను ప్రధానిగా నియమించడంతోపాటు చివరకు పార్లమెంటునుకూడా రద్దుచేసి తాజాఎన్నికలకు పిలుపునిచ్చారు.

రాజకీయం గా తనపట్టును నిలుపుకుంటూ మహీంద రాజపక్ష తిరిగి పాలనపగ్గాలకు చేరువయ్యారు ఆయన పార్టీ వెల్లువలాంటి విజయం చేజిక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే రెండుసార్లు సాధారణ ఎన్నికలు వాయిదాపడ్డాయి.

అందిన సమా చారం ప్రకారం రాజపక్షపార్టీ అత్యధికస్థానాలు కైవ సం చేసుకుంటున్నదని తేలింది.ఇప్పటివరకూ ప్రక టించిన ఫలితాల్లో శ్రీలంక పీపుల్స్‌పార్టీ (ఎస్‌ఎల్‌పి పి)145స్థానాలేకాకుండా ఆపార్టీ మిత్రపక్షాలతో కలిపి 150సీట్లు గెలిచింది.

225మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటులో ఇప్పటికే మూడింట రెండొంతుల మెజార్టీని సాధించింది.ప్రధానమంత్రి రాజపక్ష నాయ కత్వంలోని పార్టీమొత్తం 22ఎన్నికల జిల్లాల్లోని 4 జిల్లాలుమినహా మిగిలిన అన్నిస్థానాల్లోను తన పట్టు నిరూపించింది.దక్షిణాదిలో ఎక్కువ మెజార్టీతో కొనసా గుతున్నది.

ఎక్కువభాగం ఈప్రాంతంలో సింహళ జాతీయులే ఉంటారు.60శాతంవరకూ జనాభా వీరే ఉంటున్నారు.పార్టీపరంగా కూడా సింహళీయుల ఓట్లే రాజపక్ష పార్టీకి ఎక్కువ లభించాయి. ఎస్‌ఎల్‌పిపి పార్టీకి 59.9శాతం ఓట్లులభించాయి.

సంఖ్యాపరంగా చూస్తే 6.8 మిలియన్‌ ఓట్లు రాబట్టింది.గత ఏడాది నవంబరులో జరిగినఅధ్యక్షఎన్నికల్లో గోటబయ రాజ పక్ష తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు.

ఎస్‌ఎల్‌ పిపి టికెట్‌పైనే ఆయనపోటీచేసి తనఆధిపత్యంనిరూ పించారు.అనుకున్న షెడ్యూలుపరంగా ఆరునెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన మేరకు ఆయన పార్లమెంటు రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. పార్లమెంటరీ ఎన్నికల్లో 150స్థానాలు విధిగా రాబట్టు కోవాల్సిఉంటుంది.

పార్లమెంటును మరింత శక్తివంతం చేసేందుకు అధ్యక్షుని ఎన్నికలను కుదించిన రాజ్యాం గంలోని 19వ సవరణకు ఆమోదం లభించాలంటే గోటబయ రాజపక్షపార్టీ పాలనలోకి రావాల్సి ఉం టుంది.

ఇక రణిల్‌ విక్రమ్‌సింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)కి ఈ ఎన్నికల్లో పెద్ద విఘాతమే కలిగింది. యుఎన్‌పి కేవలం ఒకే ఒక్కస్థానం సాధించింది.

దేశవ్యాప్తంగా పోలైనఓట్లు కూడా తక్కువగానే ఉన్నా యి. దేశంలో అతిప్రాచీన పార్టీగాచెపుతున్న యుఎన్‌ పి22 జిల్లాల్లో కనీసం ఒక్కస్థానం కూడా గెలుచు కోలేకపోయింది.

నాలుగు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి1977 నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న విక్రమ్‌ సింఘే కొలంబోజిల్లానుంచి ఎన్నికకాలేకపోయారు.

ఆయన పార్టీకూడా ఎక్కువ నియోజకవర్గాల్లోనాలుగో స్థానానికి పరిమితమైంది. యుఎన్‌పికి 2,49,435 ఓట్లు వచ్చాయి.

రెండుశాతం మాత్రమే లభించాయి. దేశ వ్యాప్తంగా ఐదోస్థానంలో నిలిచింది.విక్రమ్‌సింఘే మాజీ డిప్యూటిప్రధాని,రాష్ట్రపతి అభ్యర్థి సాజిత్‌ప్రేమ దాస యుఎన్‌పినుంచి వేరుపడి సొంతపార్టీని స్థాపిం చారు.ఎస్‌జెపి పేరిట స్థాపించిన ఈపార్టీ55స్థానాలు గెలుచుకుంది.

తన మిత్రపక్షం ముస్లిం పార్టీతో కలిసి మంచిఫలితాలు రాబట్టుకుంది.ట్రింకోమలి ప్రాంతం లోని తూర్పుఓడరేవు జిల్లాల్లో ఎక్కువస్థానాలు రావ డంకూడా విక్రమసింఘేకు పెద్ద దెబ్బతగిలిందని చెప్పాలి.

ఎస్‌జెబికి 2.7 మిలియన్‌ ఓట్లులేదా 23 శాతం పోలైనట్లుతేలింది.అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఫలితాలపరంగాచూస్తే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఇక ప్రధాన తమిళ్‌పార్టీ టిఎన్‌ఎ కూడా ఎంతమాత్రం నెట్టుకురాలేకపోయింది. మొత్తం 16 స్థానాలనుంచి పదిస్థానాలకు దిగజారింది.మూడుజిల్లా ల్లో అందులోనూ తమిళులు ఎక్కువ్ఞన్న ప్రాంతాల్లో ఉత్తర శ్రీలంకలోనే స్థానాలు వచ్చాయి.

3,27,168 ఓట్లులభించి 2.82శాతంగా రికార్డు సాధించింది.ఇక మార్క్సిస్టు ఆధ్వర్యంలోని జెవిపి కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది.

గతఎన్నికల్లో ఆరుస్థానాలు గెలుచుకున్న జెవిపి ఈసారి మూడోస్థానానికివెళ్లింది. అంతేకాకుండా ఇప్పటివరకూ అధికారంలోఉన్న యు ఎన్‌పిని 4వస్థానంలోకి నెట్టింది.ఈపార్టీ కొన్నిస్థానా ల్లో ఐదు,ఆరోస్థానాలకు కూడా పడిపోయింది.

జెవిపికి 4,45,958ఓట్లులభించాయి.మొత్తం పోలైన ఓట్లలో 3.84శాతం లభించాయని అంచనా.ఈఏడాదిమార్చి 2వ తేదీనే అధ్యక్షుడు గోటబయ పార్లమెంటును రద్దుచేసారు.ఆరునెలల్లోపు ఎన్నికలకువచ్చారు.ఏప్రిల్‌ 25వ తేదీజరగాల్సిఉంది.

ఆ తర్వాత వాయిదాపడి సుమారు రెండునెలల తర్వాత జూన్‌20కి వాయిదా వేసారు.అయితే కరోనావైరస్‌ కారణంగా ఈద్వీపకల్ప దేశంలో మరోసారి వాయిదాపడ్డాయి.ఎన్నికలసంఘం నిష్కర్షగా మహమ్మారి వ్యాప్తినేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ఏకాభిప్రాయంతో వెల్లడించింది.

ఆరోగ్య మార్గదర్శకాలు పాటించేందుకుగాను ఈసారి పార్లమెంటు ఎన్నికలకు కేంద్ర ఎన్నికలసంఘం అనేకసార్లు మాక్‌పోల్స్‌నిర్వహించింది.అలాగే కొన్ని చోట్ల పోలింగ్‌ సమయంకూడా ఒక గంట పెంచింది. మొత్తం16 మిలియన్ల మంది అర్హులైన ఓటర్లు ఉంటే ఆగస్టు ఐదవతేదీ ఎన్నికల ఫలితాలు వెలు వడ్డాయి.

225మంది సభ్యులున్న పార్లమెంటుకు ఐదేళ్ల కాలానికి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ఎన్నికల్లో మరోసారి మహీంద రాజపక్ష తిరుగులేని మెజార్టీ సాధించిమళ్లీ అధికార పగ్గాలుచేపట్టనున్నారు.

అయితేఈసారి శ్రీలంకలోని తమిళుల పట్ల ఆయన వైఖరి ఏమిట న్నది ముందే స్పష్టంచేయాల్సిన అవసరం ఉంది.

  • గన్ని మోహన్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/