శాంతి భద్రతల పరిస్థితి

రాష్ట్రం: జమ్మూకశ్మీర్‌

Jammu and Kashmir-Peacekeeping situation
Jammu and Kashmir-Peacekeeping situation

దశాబ్దాలుగా నెలకుని ఉన్న కశ్మీర్‌ కల్లోలాన్ని ఒక్క సంవత్సర కాలంలోనే పూర్తిస్థాయిలో సద్దుమణిగేలా చేయడం అసాధ్యమే.

కానీ ఈ మేరకు పడిన అడుగులు ఎప్పటిలోగా ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తెస్తాయనేది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నయే.

పైగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదమూకలు తిరిగి పేట్రేగిపోతున్నాయి. ఉగ్రమూ కల మారణహోమంలో భాగంగా ఇటీవలే బిజెపిపార్టీకి చెందిన సర్పంచ్‌ను హత్యచేశారు.

వారి బెదిరింపులతో ఆ పైన అయిదుగురు ప్రజాప్రతినిధులు తమతమ పదవ్ఞలకు రాజీనామాలు చేశారు. అయితే వారంతా బిజెపికి చెందిన వారే కారణం యాదృచ్ఛికం కాదు.

కేద్రప్రభుత్వ ఏలుబడిలోనే కాశ్మీరం ఏడాదికాలంగా కొనసాగుతుండటం, బిజెపి నేతలు అధికార పార్టీ వారు కావడంతోనే ఉగ్రవాదులు వారి లక్ష్యంగా దాడులు సాగిస్తున్నారు. దీంతో భయపడి రాజీనామా చేసి పదవ్ఞలనుంచి తప్పుకుంటున్నారు.

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించడంతోపాటు ఆ రాష్ట్రానికి వర్తించే 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి ఒక సంవత్సరం పూర్తి అయింది. ఈ 12 నెలల కాలంలో అనేకపరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపో యామనే కారణంతో కూడా కావచ్చు కేంద్రప్రభుత్వం తాజాగా జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ను కూడా బదిలీ చేసి కొత్త నియామకం చేశారు.

ఈ రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టే విధంగా సీనియర్‌ ఐపిఎస్‌ 1985 బ్యాచ్‌కు చెందిన జిసిముర్మును కేంద్రం నియమించి, ఆయన ద్వారా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు తిరిగి నెలకొనే విధంగా కార్యాచరణ ప్రణాళికనుసిద్ధంచేశారు.

కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి,370 అధికరణ రద్దు తర్వాత కూడా ఉగ్రవాదుల కార్యకలాపాలు తగ్గ లేదు.సరికదా బిజెపి నేతలను టార్గెట్‌ చేస్తూ దాడులు సాగిస్తుండటంతో కేంద్రం ఐపిఎస్‌ అధికారి స్థానంలో రాజకీయనేతను లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానియమించింది.

రాష్ట్రంలో అధిక సమయం రాష్ట్రపతి పాలన కొనసా గుతున్నది. అంటే నేరుగా కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే జమ్మూకాశ్మీర్‌ ప్రాంతంలో పరిపాలన వ్యవహారాలు కొనసాగుతున్నా పరిస్థితి కంట్రోల్‌లోకి రావడం లేదు.

రాష్ట్ర విభజన, 370 అధికరణ రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో అన్ని సమస్యల సర్దుబాటుకు ఇవే తరుణోపాయాలుగా పార్లమెంట్‌లో వెల్లడించింది.ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక కార్యక్ర మాలు వివిధస్థాయిల్లో ఉన్నాయి.

జమ్మూకాశ్మీర్‌ పరిధిలో 2,300 ప్రాజెక్టులను ప్రతిపాదించగా ఇప్ప టివరకు 606 మాత్రమే పూర్తి అయినట్లుగా ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ పేరుతో ఈ ప్రాం తంలో అమలు జరుగు తున్నకార్యక్రమాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి.

ప్రారంభించిన ఏడు కీలక పథకాలకు సంబం ధించి ఇప్పటివరకు 27శాతంవరకే నిధులు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుల కోసం కేటాయించిన మొత్తం నిధులలో మరో పదిశాతం మాత్రమే ఈ ఏడాదిలో ఖర్చు చేయగలిగారు.

అయితే ఈ ఏడాదికాలంలో చేపట్టిన ప్రత్యేకకార్యక్రమం’బ్యాక్‌ టు విలేజి మాత్రం కొంత ఉపయుక్తంగా అమలైంది.

ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అధికారులు సిబ్బంది గ్రామాలకు వెళ్లి వారి సాధకబాధకాలు తెలుసుకొని పరిష్కరించేం దుకు చర్యలు ప్రారంభించారు.

ప్రత్యేకంగా గ్రామ సభలునిర్వహించి గ్రామీణ ప్రజలతో నేరుగా చర్చించి వారికి అండదండలు అందిస్తున్నారు.

ఇక నిరుద్యోగ యువతను ఉగ్రవాదులు ఆకర్షించి, తమ కార్యకలా పాలకు వారిని చేర్చుకుంటున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కల్పించే పథకాల కింద ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రారంభించింది.

ఈ మేరకు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు నియామకప్రక్రియ చేపడు తున్నారు.మరో 30వేల మందికి కూడా ఉపాధి లభించే చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

వీరికి స్వయం ఉపాధిరంగాల్లో ప్రోత్సాహకాలందిస్తున్నారు. దాదాపు 30వేల మంది టీచర్లను తాత్కాలికంగానియ మించి గ్రామస్థాయిలో విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వపరంగా జరుగుతున్న నియామకా లన్నింటిలోనూ అవినీతి, బంధుప్రీతికి తావ్ఞలేకుండా పారదర్శకంగానిర్వహించేందుకు అధికారయంత్రాంగం గట్టిగా వ్యవహరిస్తున్నది.

ఈసమయంలో రిజర్వేషన్లను కూడా సమర్థవంతంగా అమలు చేస్తూ వెనుకబడిన వారికి ఇప్పటివరకు తగినఅవకాశాలు లభించని దళి తులకు ఉపాధి సదుపాయాలు అందిస్తున్నారు.

లెఫ్టి నెంట్‌ గవర్నర్‌గా తన సంవత్సరకాలంలో పలుకార్య క్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లుగా గిరీష్‌ చంద్రముర్ము విశ్వాసం వ్యక్తంచేస్తూ పలు అవరోధా లవల్ల ఇంకా అనేకకార్యక్రమాలు పూర్తిస్థాయిలోఅమలు జరగలేదని ప్రకటించారు.

కాశ్మీర్‌ప్రాంత ప్రజలు అత్య ధికంగా టూరిజంరంగంపైనే ఆధారపడి జీవనం సాగి స్తుంటారు. అయితే పర్యాటకులను తోడ్కొని బోట్లు నడిపేవారు రోజుకు వెయ్యిరూపాయలకుపైగా సంపా దించేవారు.

కానీ నేడు కేంద్రంపేదలకు నెలకు అంది స్తున్న వెయ్యి,పదిహేను వందలకోసం ఎదురుచూస్తు న్నారు.వారి జీవనపరిస్థితి అధ్వాన్నంగా ఉంది.

తాజా గా కొవిడ్‌-19 వైరస్‌తో పర్యాటకరంగం మరింత కుదేలైంది.అమర్‌నాధ్‌ యాత్రకు తోడు మతావైష్ణోదేవి యాత్రలు కూడా రద్దయ్యాయి.

పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం ఔత్సాహికులను ఆకర్షించేందుకు ఇరవై వేలకోట్లవరకు (ఎంఒయు)ఒప్పందాలుజరిగాయి.

ఇవన్నీ అమలులోకిరావాల్సిఉంది. ఉగ్రవాదులచర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.అయితే కొత్తగా లెఫ్ట్‌ నెంట్‌గవర్నర్‌గా నియమితులైన మనోజ్‌సిన్హా ఈ సమ స్యలన్నీ సవాల్‌గా స్వీకరించాల్సి ఉంటుంది.

కేంద్రం అండదండలతో ఆయన ఈప్రాంత పురోగతికి చర్యలు తీసుకోవాలి.బిజెపి సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి గా ఉన్న తన అనుభవంతో సిన్హా ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధిని కొనసాగించాలి.

  • కోనేటి రంగయ్య

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/