అమరవీరుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత

పోలీసు అమరవీరులకు సిఎం కెసిఆర్ ఘననివాళి

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినత్సోవం. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ సామాజిక భద్రతకు మూలస్తంభాలైన పోలీసులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. విధి నిర్వహణలో కన్నుమూసిన పోలీసుల సేవలను వేనోళ్ల కీర్తించారు. ప్రజల ప్రాణాలను, ప్రజల ఆస్తులను కాపాడడంతో పోలీసుల అసమాన త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం త్యజించి ధీరోదాత్తులుగా నిలిచిపోయిన అమరవీరుల కోసం పోలీసు శాఖ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సిఎం కెసిఆర్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సిఎంవో ట్విట్టర్ లో వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/