రాధే శ్యామ్ ఇంటర్వూస్ క్యాన్సిల్ చేసిన ప్రభాస్..కారణం అదేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 14 న రిలీజ్ కాబోతుంది. ఇది మొన్నటి వరకు వినిపించిన వార్త. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో కాదో అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. దేశ వ్యాప్తంగా కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం తో పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ లు మొదలయ్యాయి.

అలాగే సినిమా థియేటర్స్ సైతం మూతపడ్డాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తే బాగోదని సినిమాను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో రాధే శ్యామ్ మూవీ కూడా వాయిదా పడబోతుందనే వార్తలు వైరల్ గా మారాయి. చిత్ర యూనిట్ ఇప్పటివరకు సినిమా రిలీజ్ అవుతుందనే చెపుతున్నప్పటికీ..బయటకు జరుగుతుంది మాత్రం వేరేలా ఉంది. దీనికి ఉదాహరణే ప్రభాస్..ఇంటర్వూస్ రద్దు చేయడం.

రాధే శ్యామ్ ప్రమోషన్స్ కోసం మీడియా సమావేశాలని ప్లాన్ చేసుకున్న ప్రభాస్ తాజాగా వాటిని క్యాన్సిల్ చేసినట్టుగా తెలిసింది. దీంతో రాధేశ్యామ్ విడుదల విషయంలో వస్తున్న వార్తలు నిజమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కు విషయం తెలిసిపోయింది కాబట్టే మీడియా ఇంటరాక్షన్ ల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న మీటింగ్ లని అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది.