తెలంగాణ లో లాక్ డౌన్ ఫై కేసీఆర్ క్లారిటీ

KCR tour Nalgonda district today
KCR tour Nalgonda district today

దేశ వ్యాప్తంగా కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం తో పలు రాష్ట్రాలు కేసుల కట్టడి కోసం పలు ఆంక్షలు మొదలుపెట్టారు. రాత్రి కర్ఫ్యూ తో పాటు స్కూల్స్ , షాపింగ్ మాల్స్ మూతవేసారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం తో ప్రజలు ఖంగారుపడుతున్నారు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా రాత్రి కర్ఫ్యూ కానీ లాక్ డౌన్ కానీ విదిస్తారేమో మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అక్కర్లేదని అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పిన కేసీఆర్​.. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పటిష్టం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. మిగతా నగరాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ సెలవుల్లోనే సంక్రాంతి సెలవులు కూడా ఇచ్చినట్టే. అంతేకాకుండా ఈ సెలవుల ముగిసే లోపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగితే సెలవులు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంటుందని సమాచారం.