హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాజమౌళి

హిట్ చిత్రానికి సీక్వెల్ గా హిట్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా , శైలేష్ కొల‌ను డైరక్షన్ లో 2020 లో క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ లో కూడా విశ్వక్ సేన్ హీరోగా ఉంటారని అనుకున్నారు కానీ విశ్వక్ బదులుగా అడివి శేష్ ను తీసుకున్నారు.వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ లో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాదు – ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుక కు ముఖ్య అతిధిగా రాజమౌళి హాజరు కాబోతున్నారు. రాజమౌళితో నానికి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈగ మూవీ లో నాని కీలక రోల్ చేసాడు. అలాగే నాని నటించిన మజ్ను మూవీ లో రాజమౌళి ఓ చిన్న పాత్రలో కనిపించడం జరిగింది. ఆలా ఇద్దరు చాల క్లోజ్ గా ఉంటారు. అందుకే నాని అడగగానే వెంటనే వస్తానని చెప్పినట్లు సమాచారం.