మునుగోడు నియోజకవర్గంలో తనపై వెలిసిన పోస్టర్లపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్

rajagopal reddy responds on posters

మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఇప్పుడు బిజెపిలో చేరి..బిజెపి నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘తెలంగాణ ద్రోహివి… రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి… సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి… మునుగోడు నిన్ను క్షమించదు’ అంటూ పోస్టర్లపై పేర్కొన్నారు. వ్యక్తిగతంగా దూషించే విధంగా ఉన్న ఈ పోస్టర్లు చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ప్రత్యక్షమయ్యాయి.

ఈ పోస్టర్ల ఫై రాజగోపాల్ మండిపడ్డారు. పోస్టర్లలో చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని..రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వ్యాపారాల్లో సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని..రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించలేదని చెప్పారు. ప్రాణం పోయిన తప్పుచేయనన్న ఆయన..తప్పుచేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. తనపై వెలసిన పోస్టర్లపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని..తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరని చెప్పారు. ఇక ఈ నెల 21 న రాజగోపాల్ కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు.