కెసిఆర్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

వికారాబాద్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం పరిగి నియోజకవర్గంలోని చన్గోముల్, రంగాపూర్, దోమ, కుల్కచర్లల్లో రైతువేదిక నూతన భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కెసిఆర్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ఆమె అన్నారు . రైతులు మెరుగైన వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు అవసరమని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, ప్రతి క్లస్టర్‌‌కు ఒక రైతు వేదిక భవనాన్ని నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. రూ.20 లక్షలతో నిర్మించే రైతు వదిక భవనాలను రెండు నెలల్లో పూర్తి చేసి రైతులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు… రైతులకు పంట సాగుపై సూచనలు, మెలకువలు…. పండించిన పంట మార్కెటింగ్ చేసుకునేందుకు కావలసిన సమాచారం అందజేస్తారని అన్నారు. సీఎం కెసిఆర్ రైతు శ్రేయస్సు కోసం ఎన్నో రైతు సంక్షేమ పథకాలు రూపొందించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.


తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/business/