చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు బ‌లి కావొద్దుః మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం

శూర్ప‌ణ‌ఖ‌ల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌ని ఆరోప‌ణ‌

ap-minister-gummanur-jayaram- fires-on-chandrababu-and-lokesh

న్యూఢిల్లీః ఏపీ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం నేడు క‌ర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు, టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌ల‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొంద‌రిని శూర్ప‌ణ‌ఖ‌లుగా చేసిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుదేన‌ని కూడా జ‌య‌రాం మ‌రో ఘాటు వ్యాఖ్య చేశారు. చంద్ర‌బాబుకు అమ్మాయిల‌ను రాజ‌కీయం కోసం వాడుకోవ‌డం తెలుసు త‌ప్పించి.. మ‌హిళల‌ను ఆదుకోవ‌డం తెలియ‌ద‌న్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు బ‌లి కావొద్దంటూ ఆయ‌న మ‌హిళ‌ల‌కు సూచించారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో ఫేక్ అని ఎస్పీ చెప్పినా… ఈ విష‌యంపై మ‌రింత వివాదం రాజేసేందుకు టీడీపీ య‌త్నిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/