మునుగోడు ప్రచారంలో రాజ గోపాల్ రెడ్డి భార్య

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భార్య సైతం పాల్గొని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ఫై అన్ని పార్టీలు ఫోకస్ చేసాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నిక లో గెలిచి సత్తా చాటాలని అధికపార్టీ టిఆర్ఎస్ తో పాటు బిజెపి , కాంగ్రెస్ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. అన్ని పార్టీల నేతలు ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. సోమవారం బిజెపి అభ్యర్థి గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజగోపాల్ తో పాటు ఆయన భార్య లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఏళ్లుగా ఉద్యమం చేసినా రాని గట్టుప్పల్ మండలం రాజ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్కరోజులోనే వచ్చిందనే విషయాన్నీ ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూ లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక ఈరోజు నుంచి మునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించనుంది. చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. తూప్రాన్ పేట్, మల్కాపురం, ఖైతాపురం, ఎల్లంబావి, ధర్మోజిగూడెం, కొయ్యలగూడెం, అల్లాపురం, ఎనగొండి తండా, దుబ్బతండాలో ప్రచానం నిర్వహించనున్నారు. మరోపక్క మునుగోడు ఉప ఎన్నిక ఫై సీరియస్ గా ఫోకస్ చేసిన టిఆర్ఎస్… అన్ని గ్రామాలను మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టేస్తున్నారు. ఈనెల 30న చండూరులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనుంది. సభకు సంబంధించి ఇప్పటికే అక్కడి లీడర్లతో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చించారు.