ఎల్బీనగర్ లోని ఓ లాడ్జ్ లో వ్యభిచార దందా గుట్టురట్టు

హైదరాబాద్ మహానగరంలో అనేక చోట్ల గుట్టురట్టుగా వ్యభిచారాన్ని నడిపిస్తుంటారు. అపార్ట్మెంట్ లలో ప్లాట్ లను అద్దెకు తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారాన్ని చేయిస్తుంటారు. తరుచు పోలీసులు ఈ వ్యభిచార స్థావరాలపై నిఘా పెట్టి దాడులు చేస్తుంటారు. తాజాగా ఎల్బినగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న కర్నాటి రామారావు అనే వ్యక్తి నిర్వహిస్తున్న వెంకటేశ్వర లాడ్జిలో పోలీసులు దాడులు చేశారు. లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఈ దాడులలో ఆరుగురిని అరెస్టు చేశారు.

ఈ తనిఖీల్లో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను యజమాని రామారావు సహా రిసెప్షనిస్ట్ సహదేవ్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా అలాంటి వ్యవహారాలు మరి ఎక్కడైనా జరుగుతున్నాయా అని పోలీసులు ఆరా తీయడమే కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇక నిన్నటికి నిన్న సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ లో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి అక్కడ జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు పారిపోవడంతో, అక్కడ ఉన్న విటుడిని అరెస్టు చేసి వారి కోసం గాలింపు చేపట్టారు.